అనుభవం, ఆవకాయ అని చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • ఎన్నికలప్పుడు అలవికాని హామీలిచ్చేశారు
  • ఇప్పుడు వాటిని జగన్ నెరవేర్చాలంటే ఎలా బాబూ
  • ట్విట్టర్ లో ఘాటుగా స్పందించిన వైసీపీ నేత
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శల దాడి కొనసాగుతోంది. అనుభవం, ఆవకాయ అంటూ చంద్రబాబు ఏపీని దివాళా తీయించారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చేసి  ఇప్పుడు అవి నెరవేర్చడం జగన్ గారి బాధ్యతేనని చెప్పడం ఏంటని నిలదీశారు. రుణమాఫీని పూర్తిగా చేసేశామని తన యెల్లో మీడియాలో చంద్రబాబు రాయించుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Twitter
YSRCP
Vijay Sai Reddy

More Telugu News